![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1007 లో.. కావ్య తన బావతో కబుర్లు చెప్పుకుంటు ఉంటే ఒర్వలేని రాజ్ వచ్చి డిస్టబ్ చేస్తాడు. నాకు ఇప్పుడు టీ కావాలని రాజ్ అనగానే.. మేమిద్దరం క్లోజ్ గా ఉంటే చూడలేకపోతున్నడని కావ్య అనుకొని నవ్వుతుంది. రేపు మా ఆయన ఆఫీస్ కి వెళ్ళాక మనకి బోలెడంత టైమ్ ఉంటుంది. అప్పుడు కబుర్లు చెప్పుకుందాం బావ అని కావ్య అంటుంది.
మరుసటి రోజు ఉదయం అప్పు రన్నింగ్ చెయ్యడానికి వెళ్తుంది. అక్కడ ఆయాసంగా కూర్చొని ఉండడం చూసి.. ఇలా చెయ్యకూడదని ఒకతను అంటాడు. నీకేం తెలుసని అప్పు అతన్ని చులకన చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత అతను రిటైర్డ్ SI అని తెల్సి బాగా మాట్లాడుతుంది. ఇక అతని సలహా తీసుకొని పోలీస్ కావాలని అప్పు అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య తన బావకి ప్రోటీన్ పౌడర్ తీసుకొని వెళ్తుంటే.. రాజ్ అడ్డు వస్తాడు. నాకు కాఫీ ఎక్కడ అని అడుగుతాడు. మీరు లేచారని నాకు తెలియదు.. అందుకే మా బావకి తీసుకొని వెళ్తున్నానని కావ్య అంటుంది. అతిథి దేవో భవ అన్నారు కదా అందుకే అని కావ్య అంటుంది.
ఆ తర్వాత అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి.. నీ ప్లాన్ ఎక్కడ వరకు వచ్చిందని అడుగుతుంది. ప్లాన్ ఒకటి ఫెయిల్ అయింది కానీ ఇంకొక ప్లాన్ వర్కవుట్ అయింది కళ్యణ్ ఆఫీస్ కి వెళ్తున్నాడని అనామిక చెప్తుంది.
ఆ తర్వాత కళ్యణ్ ఆఫీస్ కి వెళ్తే ఏం లాభం రాజ్ దే కదా మొత్తమని వాళ్ళ అమ్మ అంటుంది. త్వరలోనే కళ్యాణ్ ని డెసిషన్ మేకర్ ని చేస్తాను. ఈ ఇంటికి క్వీన్ అవుతానని అనామిక చెప్పడం.. రుద్రాణి విని నాలాగే ఆలోచిస్తుంది పెద్ద ముదరని అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య రాజ్ కి కాఫీ తీసుకొని వచ్చి.. పాపం నేను వెళ్ళిపోయాక మీ అమ్మగారిని చూస్తే బాధేస్తుందని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య వాళ్ళ బావ ఇందిరదేవికి హెడ్ మసాజ్ చేస్తుంటే.. రాజ్ వచ్చి అలా కాదంటూ తను మసాజ్ చేస్తుంటాడు. ఇందులోను కావ్య వాళ్ళ బావ కంటే తక్కువ కాదు అని నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటాడు. తరువాయి భాగంలో కావ్య తన బావ కాఫీ షాప్ కి వచ్చి.. బేరర్ కి వాళ్ళ బావ డబ్బులు ఇస్తుంటే.. రాజ్ చూసి బేరర్ ని పిలిచి అతను ఎందుకు డబ్బులు ఇచ్చాడని అడుగుతాడు. కేక్ అండ్ బొకే తీసుకొని రమ్మని చెప్పాడు.. ఈ రోజు వెలంటైన్ డే కదా అందుకే అని బేరర్ చెప్పగానే.. రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |